సెంట్రల్ ఇండోనేసియాలోని నార్త్ సులవేసీ ప్రావిన్స్‌లో శనివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ సేలుపై 6.2 తీవ్రత నమోదైంది. ఉదయం 7.43 గంటలకు భూమి కపించిందని.. కెపులౌన్ తలౌడ్ జిల్లా మెలోగ్వేన్ పట్టణానికి 112 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు.
అయితే భూకంపం కారణంగా సునామీ ఏర్పడే సూచనలు లేవని స్పష్టం చేశారు.
ఆగని ప్రకంపనలు..
మరోవైపు అమెరికాలో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. కాలిఫోర్నియా, నెవడా రాష్ట్రాల సరిహద్దు వద్ద 6.0 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
5.9 తీవ్రతతో భూకంపం ఏర్పడిన కొన్ని గంటలకే వరుసగా ప్రకంపనలు రావడం స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో 1994 తర్వాత ఇదే పెద్ద భూకంపం అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 4 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయని తెలిపారు.
ఇదీ చూడండి :సముద్రంలో ఎగిసిపడిన మంటలు.. కారణమేంటి?