తెలంగాణ

telangana

ETV Bharat / international

టిక్​టాక్​ నిషేధం​ దిశగా మరో దేశం!

భారత్ తరహాలోనే టిక్​టాక్​ను తమ దేశంలోనూ నిషేధించాలని ఆస్ట్రేలియాకు చెందిన పలువురు చట్టసభ్యులు కోరుతున్నట్లు సౌత్​ చైనా మార్నింగ్ పోస్ట్​ వెల్లడించింది. యాప్​ యాజర్ల వ్యక్తిగత డేటాను చైనా ప్రభుత్వం సేకరిస్తోందని వారు భయపడుతున్నట్లు తెలిపింది.

After India, Australia to ban TikTok over fears of data security threat
భారత్​ తరహాలోనే టిక్​టాక్​ నిషేధం దిశగా మరో దేశం

By

Published : Jul 9, 2020, 5:40 PM IST

టిక్​టాక్​ను నిషేధించాలన్న డిమాండ్లు ఆస్ట్రేలియాలోనూ గట్టిగా వినిపిస్తున్నాయి. భారత్​ తరహాలో ఆ యాప్​ను బ్యాన్​ చేయాలని ఆస్ట్రేలియా చట్టసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈమేరకు ఓ కథనం ప్రచురించింది.

టిక్​టాక్​ డేటాను చైనా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు ఆస్ట్రేలియా చట్టసభ్యుడు జిమ్​ మోలన్. మరో సభ్యుడు జెన్నీ మెక్​ఆలిస్టర్​ ఇదే తరహా అభిప్రాయం వ్యక్తంచేశారు. "సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ప్రభుత్వాల జోక్యం"పై ఏర్పాటైన స్థాయీ సంఘం ముందు టిక్​టాక్ ప్రతినిధులు హాజరై, విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు జెన్నీ.

డేటా దుర్వినియోగంపై ఆరోపణల్ని టిక్​టాక్​ ఖండించినా... చైనా ప్రభుత్వం యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడం లేదనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తన కథనంలో పేర్కొంది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్.

ABOUT THE AUTHOR

...view details