చైనాలోని జుని ప్రాంతంలో మూడేళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి రోడ్డు మీద నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. రోడ్డు పక్కన తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడిపోయాడా బాలుడు. పిల్లవాడిని కాపాడటానికితండ్రి ప్రయత్నాలు చేశాడు. ఎట్టకేలకు చావు అంచులదాకా వెళ్లిన పిల్లాడిని చాకచక్యంగా ఆ తండ్రి కాపాడుకున్నాడు. స్వల్ప గాయాలతో బాలుడు బయటపడ్డాడు.
"మ్యాన్‌హోల్ లోపలంతా మురుగు నీరుతో చీకటిగా ఉంది. దాంతో నాకు సరిగా కనుబడలేదు. పిల్లవాడు గాయాలతో తన తలను పైకి ఎత్తి భయపడుతూ కనిపించాడు."