తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​కన్నా ముందే నేపాల్​లో 5జీ సేవలు?

భారత్​ కన్నా ముందు 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు నేపాల్​ వడివడిగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే స్పెక్ట్రం కేటాయింపు కోసం సంబంధిత శాఖ ముందుకు అభ్యర్థన వచ్చినట్లు సమాచారం. దీని ప్రకారం ఈ ఏడాది జులై చివరి నాటికి కాఠ్మాండూ సహా మూడు నగారల్లో 5జీ సేవలు అందించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది.

5g services in Nepal end of June
నేపాల్​లో జూన్​లో 5జీ సేవలు

By

Published : Mar 9, 2021, 6:48 PM IST

దక్షిణాసియాలో 5జీ సేవలను అందించే తొలి దేశంగా నిలిచేందుకు నేపాల్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది జులై నుంచి 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిసింది.

భారత్​లో ఇప్పటి వరకు కచ్చితమైన 5జీ ట్రయల్స్​ను కూడా నిర్వహించలేదు. నేపాల్ మాత్రం ఆ దేశ రాజధాని కాఠ్మాండూ సహా మూడు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. 5జీ సేవలకు ప్రత్యేక ఫ్రీక్వెన్సీని కేటాయించాలనే అభ్యర్థనను ఫిబ్రవరి 1నే సంబంధిత మంత్రిత్వ శాఖ ముందు ఉంచినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే నేపాల్ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలుడే అవకాశముంది.

5జీ నెట్​వర్క్​ను అందుబాటులోకి తెచ్చేందుకు... ముందుగా కావాల్సిన స్పెక్ట్రంను గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివిధ భౌగోళిక ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించి.. వాటిని విశ్లేషించాలి. విశ్లేషకుల ప్రకారం ఈ ట్రయల్స్​కు మూడు నెలల నుంచి ఏడాది వరకు పట్టొచ్చు.

ఇదీ చదవండి:ఎన్నికల తర్వాత భారీ స్థాయిలో పెట్రో బాదుడు?

ABOUT THE AUTHOR

...view details