తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ కాల్పుల ఘటనలో నలుగురు పౌరులు మృతి

పాకిస్థాన్​ గ్వాదర్​లోని ఓ హోటల్​లో తీవ్రవాదులు శనివారం జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందినట్టు ఆ దేశ సైనికాధికారులు ప్రకటించారు. అలాగే నేవీ సైనికుడు చనిపోయాడని చెప్పారు. దాడికి తెగబడిన ముగ్గురు తీవ్రవాదులను హతమార్చామని తెలిపారు.

బలూచిస్థాన్​లోని హోటల్​పై కాల్పులు

By

Published : May 13, 2019, 7:00 AM IST

Updated : May 13, 2019, 8:13 AM IST

పాక్​ బలూచిస్థాన్​ గ్వాదర్​లోని ఓ హోటల్​లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు పౌరులు మృతి చెందినట్టు ఈ దేశ సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో ఓ సైనికుడు మృతి చెందాడు. దాడికి తెగబడిన ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది.

బలూచిస్థాన్​ లిబరేషన్​ ఆర్మీకి చెందిన ముగ్గురు తీవ్రవాదులు ఆయుధాలతో శనివారం గ్వాదర్​లోని ఓ హోటల్​లోకి చొరబడి కాల్పులు జరిపారు.

"ముగ్గురు తీవ్రవాదులను హతమార్చాం. వారి వివరాలను గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనలో నలుగురు హోటల్​ ఉద్యోగులు మృతి చెందారు. అలాగే నేవీ సైనికుడు అమరుడయ్యాడు." -- పాకిస్థాన్​ సైన్యం

ఇద్దరు సైనికాధికారులు సహా ఇద్దరు నేవీ సైనికులు, ఇద్దరు హోటల్​ సిబ్బంది గాయాలపాలయ్యారు. హోటల్​లో జరిగే ఓ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులే లక్ష్యంగా తీవ్రవాదులు ఈ దాడికి తెగబడ్డట్టు పాక్​ ఆర్మీ అధికారులు చెప్పారు. ప్రధాన హాలు వద్దకు వెళ్లకుండా వారిని భద్రతా సిబ్బంది అడ్డుకొని మట్టుబెట్టారని తెలిపారు.

ఇదీ చూడండి : తిరగేసిన కార్లతో తిరుగులేని సందేశం

Last Updated : May 13, 2019, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details