తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ వేర్వేరు​ ప్రమాదాల్లో 34కు చేరిన మృతులు

పాకిస్థాన్‌లోని తూర్పు పంజాబ్‌ రాష్ట్రంలో ఓ పాసింజర్‌ రైలు.. గూడ్సు రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరో 89 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇస్లామాబాద్‌ సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో బస్సు బోల్తాపడి 13 మంది మృతి చెందారు. మరో 34 మందికి గాయాలయ్యాయి. ఈ రెండు ప్రమాదాల్లో ఇప్పటివరకు 34 మంది మరణించారు. 120 మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పాక్ వేర్వేరు​ ప్రమాదాల్లో 34కు చేరిన మృతులు

By

Published : Jul 12, 2019, 6:51 AM IST

Updated : Jul 12, 2019, 7:32 AM IST

గూడ్సు రైలును ఢీ కొట్టిన పాసింజర్‌ రైలు

పాకిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 34కు చేరింది. మరో 120 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. తూర్పు పంజాబ్‌లోని సాధిఖాబాద్‌ సమీపంలోని వాల్హార్‌ రైల్వే స్టేషన్‌లో ఓ పాసింజర్‌ రైలు.. గూడ్సు రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరో 89 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్వెట్టా బౌండ్‌ అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే పాసింజర్‌ రైలుకు ఇచ్చే సిగ్నల్‌లో పొరపాటు జరగినందున అది గూడ్స్‌ రైలు నిలిపి ఉంచిన లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది. ఫలితంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

బస్సు బోల్తా

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలో మరో ప్రమాదం జరిగింది. ఓ బస్సు బోల్తాపడి 13 మంది మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 34 మంది గాయపడ్డారు. స్వాట్‌ నుంచి లాహోర్‌ వెళ్తున్న బస్సు అతి వేగంతో అదుపుతప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

ప్రధాని సంతాపం

ఈ ప్రమాదాలపై విచారం వ్యక్తం చేశారు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని ఆదేశించారు.

Last Updated : Jul 12, 2019, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details