తెలంగాణ

telangana

ETV Bharat / international

కొండను ఢీకొట్టిన బస్సు... 26 మంది మృతి

పాకిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి కొండను ఢీకొట్టిన ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయపడ్డారు.

కొండను ఢీకొట్టిన బస్సు... 26మంది మృతి

By

Published : Sep 22, 2019, 4:05 PM IST

Updated : Oct 1, 2019, 2:20 PM IST

పాకిస్థాన్​ ఖైబర్​ పఖ్తుంక్వా-గిల్గిట్ బాల్టిస్థాన్​ సరిహద్దులో ఘోర ప్రమాదం జరిగింది. బాబుసర్​ టాప్ ప్రాంతంలో ఓ బస్సు అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 26 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.

జరిగిందిలా...

ఓ ప్రైవేటు బస్సు శనివారం స్కర్దు నుంచి రావల్పిండి బయలుదేరింది. వాహనంలో 16 మంది పాకిస్థానీ సైనిక అధికారులు సహా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆదివారం ఉదయం బాబుసర్ పాస్​ రోడ్​పై ఒక్కసారిగా బస్సు అదుపు తప్పింది. వేగంగా వెళ్లి కొండను ఢీకొట్టింది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

ఇదీ చూడండి : 'హౌడీ మోదీ'తో ఇద్దరికీ లాభమేనా? ఏం జరుగుతుంది?

Last Updated : Oct 1, 2019, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details