తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​ సైనిక దాడిలో 25మంది ఉగ్రవాదులు హతం

అఫ్గాన్​ భద్రతా బలగాలు, తాలిబన్​ ఉగ్రవాదుల మధ్య జరిగిన దాడిలో 25మందిని హతమార్చింది ఆ దేశ సైన్యం. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

25 Taliban militants killed in raid: Afghan Army
అఫ్గాన్​ సైనిక దాడిలో 25మంది ఉగ్రవాదులు హతం

By

Published : Dec 5, 2020, 7:46 PM IST

అఫ్గానిస్థాన్​ హెల్మాండ్​ రాష్ట్రంలో జరిగిన దాడిలో ఇద్దరు కమాండర్లతో సహా.. మొత్తం 25 మంది తాలిబన్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు పేర్కొంది ఆ దేశ సైన్యం. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపింది.

నావాయీ బరాక్జాయి ప్రాంతంలోని అఫ్గాన్​ నేషనల్​ డిఫెన్స్​ అండ్​ సెక్యూరిటీ ఫోర్సెస్​(ఏఎన్​డీఎస్​ఎఫ్​) స్థావరాలపై దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. వారి ప్రయత్నాలను తిప్పికొట్టిన అఫ్గాన్​ సైనికులు.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ నేపథ్యంలోనే సైన్యం.. 25మంది ముష్కరుల్ని హతమార్చినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. కాబూల్​కు నైరుతి దిశగా 555 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఆపరేషన్​లో.. 6 ఉగ్రవాద రహస్య స్థావరాలు, 25 రక్షణ స్థానాలు ధ్వంసమైనట్టు పేర్కొంది.

అయితే.. ఈ ఆపరేషన్​పై తాలిబన్​ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇదీ చదవండి:'నిరసన చేపట్టే హక్కు రైతులకు ఉంది'

ABOUT THE AUTHOR

...view details