తెలంగాణ

telangana

ETV Bharat / international

బంగ్లాలో మరో బోటు ప్రమాదం- 17 మంది మృతి - బంగ్లాదేశ్​ వార్తలు

ఉత్తర బంగ్లాదేశ్​లోని నెట్రకోనా జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 30 మంది ప్రాణాలతో బయటపడగా మరో వ్యక్తి ఆచూకీ గల్లంతైంది. ప్రయాణికుల్లో మదర్సా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది.

Bangladesh
బోటు ప్రమాదం

By

Published : Aug 5, 2020, 10:24 PM IST

బంగ్లాదేశ్​లోని నెట్రకోనా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బోటు బోల్తాపడిన ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. 30 మంది ప్రాణాలను కాపాడారు భద్రతా సిబ్బంది. ఓ వ్యక్తి ఆచూకీ గల్లంతైంది.

ప్రయాణికుల్లో మదర్సా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

భద్రతా ప్రమాణాల లేమి..

బంగ్లాదేశ్​లో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. భద్రతా ప్రమాణాలు లోపం, విచక్షణ రహితంగా బోట్లను నడపటం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో పరిమితికి మించి ప్రయాణికుల రవాణా చేసిన కేసులే అధికంగా ఉన్నాయి. రాజధాని ఢాకాలో జూన్​లో జరిగిన ఓ బోటు ప్రమాదంలో 32 మంది చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details