తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​-బంగ్లా సరిహద్దులో అక్రమ చొరబాట్లు - పాకిస్థాన్ పౌరుల చొరబాట్లు

భారత్​లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన 12 మంది బంగ్లాదేశ్ పౌరులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అదుపులోకి తీసుకుంది. భారత్​-బంగ్లా సరిహద్దు రాష్ట్రం పశ్చిమ్​ బంగాలో పట్టుబడ్డ వీరిని బంగ్లాదేశ్​ గస్తీ పోలీసులకు అప్పగించారు.

12 Bangladeshi nationals apprehended by BSF in West Bengal
భారత్​-బంగ్లా సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు

By

Published : Jan 4, 2021, 10:10 PM IST

పశ్చిమ్​ బంగా రామ్​ నగర్​ పోలీసు ​స్టేషన్​ పరిధిలోని భారత్​-బంగ్లా సరిహద్దుల్లో అక్రమంగా చొరబడిన 12 మంది బంగ్లాదేశ్ పౌరులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అదుపులోకి తీసుకుంది. అనంతరం జరిగిన సరిహద్దు సమావేశంలో వీరిని బంగ్లా సైన్యానికి అప్పగించారు.

సోమవారం తెల్లవారుజామున బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు జరగవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు గస్తీ ముమ్మరం చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు బీఎస్​ఎఫ్​ తెలిపింది.

బంగాల్​తో 2216కిమీ..

భారత్-బంగ్లా మధ్య 4,096 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉండగా.. అసోం 263, త్రిపుర 856, మిజోరం 318, మేఘాలయ 443, పశ్చిమ్​ బంగా రాష్ట్రాలు 2216 కి.మీ. మేర సరిహద్దు కలిగి ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో చొరబాట్లు ఎక్కువ.

పొగమంచుతో చిక్కు..

అంతకముందు ​ పంజాబ్​ సరిహద్దుల్లో చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్ పౌరులను బీఎస్​ఎఫ్అదుపులోకి తీసుకుంది. ఈ కాలంలో అక్కడ కురుస్తున్న పొగమంచును చొరబాటుదారులు అదనుగా తీసుకుని చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి:'ఉగ్రవాదులు కాదు.. ఆ మృతదేహాల్ని అప్పగించండి'

ABOUT THE AUTHOR

...view details