తెలంగాణ

telangana

ETV Bharat / international

నిరసన తెలిపేందుకే సెలవు ప్రకటించిన ప్రభుత్వం! - జింబాబ్వేలో నిరసనలు

పండుగలు, జాతీయ దినోత్సవాలు వచ్చినప్పుడే ప్రభుత్వాలు సెలవు దినాలను ప్రకటిస్తాయి. కానీ జింబాబ్వేపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అక్టోబర్​ 25న అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అగ్రరాజ్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ నిరసన తెలియజేయాలని కోరింది.

నిరసన తెలిపేందుకే సెలవు ప్రకటించిన ప్రభుత్వం!

By

Published : Oct 22, 2019, 11:12 PM IST

మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటా జింబాబ్వేపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందంటూ జింబాబ్వే ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆంక్షలను నిరసిస్తూ అక్టోబర్ 25న జాతీయ సెలవు దినంగా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. అక్టోబర్​ 25ను 'ఆంక్షల వ్యతిరేక దినోత్సవం' గా జరుపుకుంటామని వెల్లడించింది. అగ్రరాజ్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ ప్రజలందరూ నిరసన తెలపాలని ప్రభుత్వం కోరింది.

జింబాబ్యే అధ్యక్షుడు ఎమెర్సన్ మనన్​గగ్వాతో సహా ప్రభుత్వాధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా ఆంక్షలు విధించింది. తమ​ ఆర్థిక వ్యవస్థ పతనమవటానికి అగ్రరాజ్యం విధించిన ఆంక్షలే కారణమని ఆ దేశ అధ్యక్షుడు ఆరోపించారు.

ఇదీ చూడండి:సెలవులు ఎక్కువ ఇచ్చారు... సిలబస్​​ తగ్గించరా...?

ABOUT THE AUTHOR

...view details