తెలంగాణ

telangana

ETV Bharat / international

విద్య నేర్పే టెక్​ మంత్రం- తెచ్చింది భారీ బహుమానం - ఎక్స్​ప్రైజ్

ఎక్స్​ప్రైజ్ ఫర్ గ్లోబల్ లెర్నింగ్ పోటీల విజేతలను ప్రకటించారు. భారత్​ నుంచి బెంగళూరుకు చెందిన 'చింపిల్'​ బృందం మొదటి ఐదుగురు విజేతల్లో నిలిచింది. మొదటి బహుమతిని.... రెండు సంస్థలు చెరో రూ. 35కోట్లు పంచుకోనున్నాయి.

విద్య నేర్పే టెక్​ మంత్రం- తెచ్చింది భారీ బహుమానం

By

Published : May 16, 2019, 8:04 PM IST

చిన్నారులందరికీ విద్య నేర్పాలి. అది కూడా... ఉపాధ్యాయులు లేకుండా, పూర్తిగా సాంకేతికత సాయంతో. ఇందుకోసం ఓ యాప్​ను అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది? ఆ యాప్​ ద్వారా నిరక్షరాస్యులు తమంతట తామే చదవడం నేర్చుకోగలిగితే? ఈ ఆలోచనకే కార్యరూపం కల్పించే ప్రయత్నం చేస్తోంది 'ఎక్స్​ప్రైజ్ ఫర్​ గ్లోబల్ లెర్నింగ్'. యాప్​ అభివృద్ధి కోసం ప్రముఖ టెక్ దిగ్గజం, స్పేస్​ఎక్స్ అధినేత ఎలాన్​ మస్క్ ఆర్థిక సహకారంతో 'ఎక్స్​ప్రైజ్ ఫర్ గ్లోబల్ లెర్నింగ్' పేరిట పోటీలు నిర్వహించింది. విజేతలను ప్రకటించింది.

విజేతలు వీరే...

ఎక్స్​ప్రైజ్​ పోటీల్లో దాదాపు 40 దేశాల నుంచి 200 బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. అమెరికాకు చెందిన 'కిట్​కిట్​ స్కూల్', లండన్​లోని 'వన్​ బిలియన్​' విద్యా సంబంధ ఎన్జీఓ సంయుక్తంగా విజేతలుగా నిలిచాయి.

కిట్​కిట్​ స్కూల్ నిర్వహిస్తున్న దంపతులిద్దరూ గేమ్ డెవలపర్స్. ఉండేది అమెరికాలోని బెర్కిలీ. దివ్యాంగుడైన వారి కుమారుడికి ప్రత్యేక యాప్​ ద్వారా విద్యాబోధన అందించాలనేది వీరి తపన.

విజేతలకు భారీ బహుమతి..

ఎక్స్​ప్రైజ్ బహుమతుల​ మొత్తం విలువ 15మిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే రూ.105 కోట్ల రూపాయలు. ఈ పోటీల్లో ఫైనల్స్​కు చేరుకున్నవారికి ఒక్కొక్కరికి మిలియన్ డాలర్ల చొప్పున బహుమతి అందించనున్నారు. మొదటి బహుమతిగా రెండు సంస్థలకు చెరో 5 మిలియన్​ డాలర్లు ఇవ్వనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఓపెన్​ సోర్స్ సాఫ్ట్​వేర్ అభివృద్ధి​ చేసి, గూగుల్​ టాబ్లెట్లలో డౌన్​లోడ్​ చేసి టాంజానియాలోని 170 మారూమూల ప్రాంతాల్లోని పిల్లలకు ఇచ్చి పరీక్షించాలి. మొదటి ఐదుగురు విజేతల్లో న్యూయార్క్, పిట్స్​బర్గ్, బెంగళూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన జట్లున్నాయి.

పిల్లల కోసం..

పోటీదారులు పిల్లలు ఆడుకుంటూ నేర్చుకునేందుకు వీలైన ప్రోగ్రాములను అభివృద్ధి చేయాలి. అవి ఉపాధ్యాయులు చెప్పినట్లుగా పిల్లలు డ్రాయింగ్స్, అక్షరాలు, నంబర్లు, ధ్వనులు తదితరాలు ఈ యాప్​ నుంచి నేర్చుకునేలా ఉండాలి.

ఈ పరీక్ష మొదలైనప్పుడు టాంజానియాలోని స్వాహిలి భాషలో 2 శాతం మంది మాత్రమే పూర్తి వాక్యం చదవగలిగారు. 15 నెలల తరువాత 30శాతం మంది వాటి ద్వారా ఎలా నేర్చుకోవాలనేది తెలుసుకున్నారు.

విజేతలు తమ సాఫ్ట్​వేర్ వీలైనంత మందికి చేరాలని ఆశిస్తున్నారు. ఎక్స్​ప్రైజ్​ స్వచ్ఛంద సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది చిన్నారులు రాయలేక, చదవలేక ఇబ్బంది పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details