అత్యంత ఎత్తయిన నివాస భవనం ఇదే..! అమెరికాలో మరో ఆకాశహర్మ్యం ప్రపంచ రికార్డు బద్దలుకొట్టేందుకు సిద్ధమవుతోంది. అత్యంత ఎత్తయిన నివాస భవనంగా గుర్తింపు పొందే లక్ష్యంతో న్యూయార్క్లో సెంట్రల్ పార్క్ టవర్ వేగంగా నిర్మితమవుతోంది.
సెంట్రల్ పార్క్ టవర్ ఎత్తు 15 వందల 50 అడుగులు. 300 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ విలాసవంతమైన నివాస భవనాన్ని నిర్మిస్తోంది ఎక్స్టెల్ డెవలప్మెంట్ కంపెనీ. వచ్చే ఏడాదికి ఈ
ఆకాశహర్మ్యం పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది.
ప్రస్తుతం న్యూయార్క్లో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్(1776 అడుగులు) అత్యంత ఎత్తయిన భవనం. తర్వాతి స్థానంలో సెంట్రల్ పార్క్ టవర్ నిలవనుంది.
నివాస భవనాల పరంగా చూస్తే... సెంట్రల్ పార్క్ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది కానుంది.
ఇదీ చూడండి : కొడుకు ఉద్యోగం కోసం భర్తను ముక్కలుగా నరికిన మహిళ