తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాసలో ఇలా జరగడం 75ఏళ్లలో తొలిసారి! - ఐరాస సాధారణ సభ

ఈ ఏడాది సెప్టెంబర్​లో జరగాల్సిన ఐరాస సాధారణ సభపై కరోనా వైరస్​ ప్రభావం పడింది. సభకు ప్రపంచ స్థాయి అగ్రనేతలు హాజరుకాలేరని సభా అధ్యక్షుడు ముహమ్మద్​ బండే వెల్లడించారు. వారు ఏ విధంగా పాల్గొంటారనే దానిపై రెండు వారాల్లో స్పష్టతనివ్వనున్నట్టు పేర్కొన్నారు.

World leaders won't gather at UN for first time in 75 years
ఐరాసలో ఇలా జరగడం 75ఏళ్లల్లోనే తొలిసారి!

By

Published : Jun 9, 2020, 10:34 AM IST

ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ఇదే వేదికగా ప్రపంచ నేతలు ఎన్నో చారిత్రక ప్రసంగాలు చేశారు. ఎన్నో కీలక చర్చలు జరిపారు. కానీ కరోనా మహమ్మారి వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్​లో న్యూయార్క్​ వేదికగా జరగనున్న సాధారణ సభ వార్షిక సమావేశానికి ప్రపంచ స్థాయి నేతలు హాజరుకాలేరు. ఈ విషయాన్ని సభ అధ్యక్షుడు తిజ్జాని ముహమ్మద్​ బండే తెలిపారు.

"ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి నేతలు న్యూయార్క్​కు రాలేరు. ఎందుకంటే అధ్యక్షుడు ఒక్కరే ప్రయాణం చెయ్యరు. అధ్యక్షుడితో పాటు పెద్ద సంఖ్యలో బృందాలు కూడా వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఇలా జరగకూడదు. అందువల్ల వారు ఒక్కరే, వ్యక్తిగతంగా హాజరు కావడం కష్టం. 74ఏళ్లుగా జరగనిది ఈసారి జరుగుతుంది."

-- ముహమ్మద్​-బండే.

అయితే 193 అగ్రనేతలు ఏ విధంగా ప్రసంగిస్తారనే విషయంపై మరో రెండు వారాల్లో స్పష్టతనిస్తామని వెల్లడించారు ముహమ్మద్​. స్థానిక, ప్రపంచ స్థాయి సమస్యలను వారు ప్రస్తావిస్తారని పేర్కొన్నారు.

సెప్టెంబర్​లో ఐరాస సాధారణ సభ జరగాల్సి ఉంది. అప్పటికల్లా కనీసం కొన్ని వందల మంది సభ ఛాంబర్​లోకి చేరుకునే పరిస్థితులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు ముహమ్మద్​.

75వ వార్షికోత్సవం...

1945లో ఐరాసను స్థాపించారు. అంటే ఈ ఏడాదికి 75 ఏళ్లు నిండుతాయి. తొలుత ఈ 75వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. కానీ కరోనా వైరస్​.. ప్రణాళికను పూర్తిగా మార్చేసింది. అయితే ఈ వార్షికోత్సవాలు వివిధ రూపాల్లో జరుగుతాయని సాధారణ సభ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇవి ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details