World corona cases: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. మరణాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఒక్కరోజే 27,72,068 కేసులు నమోదవగా.. 7,847 మంది మరణించారు. కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో కొవిడ్ కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి.
Covid Cases in America
అమెరికాలో కరోనా ప్రళయంలా విరుచుకుపడుతోంది. కాలిఫోర్నియాలో కొవిడ్ బారిన వైద్య సిబ్బందిని కూడా విధులకు హాజరు కావాలని పాలనా యంత్రాంగం సూచించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అగ్రరాజ్యంలో కొత్తగా 6,72, 872 మంది వైరస్ బారిన పడగా.. 2,173 మంది మృతి చెందారు.
ఫ్రాన్స్‌లో ఆగని ఉద్ధృతి..
France Corona Cases: ఫ్రాన్స్‌లో వైరస్ విలయం కొనసాగుతోంది. ఒక్కరోజే 3,68,149 మందికి వైరస్ సోకింది. మరో 341 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్‌తో పాటు మరో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ కట్టడికి కఠిన చర్యలు అమలు చేస్తున్నా.. పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
లాక్డౌన్లో మరో చైనా నగరం..
China Lockdown: కరోనా కట్టికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న చైనాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో మరో నగరం అన్యాంగ్‌లో లాక్డౌన్ విధించారు. ఇప్పటికే జియాన్, టియాంజిన్‌లో లాక్డౌన్ విధించిన అధికారులు.. వచ్చే నెలలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న నగరంలో ఆంక్షలు విధిస్తున్నారు.
పాక్‌లో ఐదో దశ..
పాకిస్థాన్‌లో 10కోట్ల మందికి కనీసం ఒక టీకా డోసు పంపిణీ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వారిలో 7.5కోట్ల మందికి రెండు డోసులు అందించినట్లు పేర్కొన్నారు. అయితే ఇంకా పని పూర్తి కాలేదని.. దేశంలో ఐదోదశ కరోనా వ్యాప్తి ప్రారంభమైందని వెల్లడించారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లక్ష దాటిన కరోనా మరణాలు
పోలాండ్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య లక్ష దాటింది. తాజా కొవిడ్ వ్యాప్తితోనే 24 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 11,406 మంది వైరస్ బారిన పడగా.. కొవిడ్ ధాటికి మరో 493 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,00,254కు చేరింది.
Worldwide Covid Cases
- బ్రిటన్‌లో మరో 1,20,821 మందికి వైరస్ సోకింది. 379 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 2,20,532 కొత్త కేసులు బయటపడగా.. 294 మంది మరణించారు.
- స్పెయిన్‌లో 1,34,942 మందికి కొత్తగా వైరస్ సోకింది. 247 మంది మృతి చెందారు.
- అర్జెంటీనాలో కొత్తగా 1,34,439 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 52 మంది మరణించారు.
- ఆస్ట్రేలియాలో కొత్త కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 92,866 మందికి వైరస్ సోకగా.. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
- టర్కీలో కొత్తగా 74,266 కేసులు నమోదవగా.. 137 మంది మరణించారు.
- జర్మనీలో 61,205 కేసులు, 387 మరణాలు నమోదయ్యాయి. 47వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- బ్రెజిల్లో సోమవారం కొత్తగా 71,447 మందికి వైరస్ సోకింది. 139 మంది మరణించారు.
ఇదీ చూడండి:సిబ్బంది కొరత- కరోనా సోకిన నర్సులతోనే వైద్య సేవలు