అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం కేన్సస్కు చెందిన 51 ఏళ్ల ఏంజెలా కార్వేలా.. ఫ్లోరిడాలో విమానం ఎక్కాల్సి ఉంది. ఇంతలో విమానం రద్దు చేస్తున్నట్లు సిబ్బంది ప్రకటించారు. దీంతో చేసేదేమీ లేక బయటకు వచ్చిన కార్వేలా.. సమీపాన ఉన్న ఓ సూపర్మార్కెట్లో 30 డాలర్లు (రూ.2,220) పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. అంతే.. ఇక్కడితో ఆమె దశ తిరిగింది. ద ఫాస్టెస్ట్ రోడ్ అనే సంస్థ నిర్వహించిన ఈ లాటరీలో కార్వేలా విజేతగా నిలిచింది. ప్రైజ్‌మనీగా ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.5కోట్లు) గెలుచుకుంది.
నేను అప్పుడే అనుకున్నా..
ఈ లాటరీ టికెట్ గెలుపుతో కార్వేలా ఆనందంలో మునిగితేలుతోంది. తనకు విమానం రద్దు అయినప్పుడే ఏదో వింత అనుభవం ఎదురుకానుందని అనిపించిందని చెప్పుకొచ్చింది. సమయం గడపడం కోసం సరదాగా కొన్న స్క్రాచ్ ఆఫ్ టికెట్లతో కోట్లు గెలుచుకున్నానని సంతోషం వ్యక్తం చేసింది. ఈ నగదులో కొంత మొత్తం పన్నులకు పోగా.. 7,90,000 డాలర్లు (రూ.5.8 కోట్లు) కార్వేలా చేతికి అందనున్నాయి.
కార్వేలాకు లాటరీ టికెట్ విక్రయించిన పబ్లిక్స్ సూపర్ మార్కెట్‌కు కూడా 2000 డాలర్లు (రూ.1.4 లక్షలు) బోనస్ కమీషన్ అందనుంది.
ఇదీ చూడండి :ఈ కోతి సోకులకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్