తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆయన గెలిస్తే ఇండియాకు పూర్తి సహకారం' - Joe Biden says stand with India

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ గెలిస్తే భారత్​కు పూర్తి మద్దతు లభిస్తుందని ప్రచారం చేస్తోంది డెమోక్రటిక్ పార్టీ బృందం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సహా మరే దేశం ఇతర దేశాలను బెదిరించకుండా.. స్థిరత్వం కోసం భారత్‌తో కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చింది. హెచ్1బీ వీసా వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని ఆయన ప్రచార బృందం తెలిపింది.

will-stand-with-india-in-confronting-threats-if-elected-says-joe-biden
'భారత్ కు అండాగా ఉంటాం.. హచ్1బీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం!'

By

Published : Aug 16, 2020, 10:45 AM IST

భారత్‌-అమెరికా సంబంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ప్రచారబృందం తెలిపింది. బాధ్యతాయుత భాగస్వాములుగా వ్యవహరించనంతవరకు.. ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ప్రపంచ సమస్యలు పరిష్కారం కావని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇండో-అమెరికన్లపై ప్రత్యేక విధాన పత్రాన్ని విడుదల చేసిన ఆయన ప్రచార బృందం.. దక్షిణాసియాలోని ఉగ్రవాదాన్ని బైడెన్‌ సహించబోరని పేర్కొంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సహా మరే దేశం ఇతర దేశాలను బెదిరించకుండా.. స్థిరత్వం కోసం భారత్‌తో కలిసి పనిచేస్తామని చెప్పింది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు భారత రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే అంశంపై..... కలిసి పనిచేస్తామని తెలిపింది. ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చడం సహా ఉన్నత విద్య, అంతరిక్షరంగం వంటి అంశాల్లో సంబంధాలను కొనసాగిస్తామని పేర్కొంది.

నవంబరులో జరిగే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్​ను ఎన్నుకుంటే.. హచ్1బీ వీసా వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని ఆయన ప్రచార బృందం తెలిపింది. గ్రీన్​కార్డులకు దేశాల వారీగా ఉన్న కోటాను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించింది.

ఇదీ చదవండి:ట్రంప్​ డెడ్​లైన్​: టిక్​టాక్​ ఆస్తులను 90 రోజుల్లోపు..

ABOUT THE AUTHOR

...view details