2040 నాటికి అల్ప, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో 81 శాతం మేర క్యాన్సర్ కేసులు పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. క్యాన్సర్ నివారణ, నియంత్రణ దిశగా ఖర్చు చేసే వ్యయం తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది. 'ప్రపంచ క్యాన్సర్ దినం' సందర్భంగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
తక్కువ, మధ్య ఆదాయ దేశాలు క్యాన్సర్‌పై పోరాటాన్ని నిలిపేసి..అంటు వ్యాధులను ఎదుర్కోవడం, తల్లి, పిల్లల ఆరోగ్య సంరక్షణపై దృష్టి కేంద్రీకరించాయని స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్ఓ. అయితే పొగాకు వల్లే 25 శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.
"ప్రజలకు ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించొచ్చు. సమర్థవంతంగా చికిత్స చేసి.. నయం చెయ్యొచ్చు. క్యాన్సర్ కారణంగా ఎవరూ మరణించకూడదు."