తెలంగాణ

telangana

ETV Bharat / international

'రెండు రోజుల్లో ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర'

Russia Ukraine Tensions: ఉక్రెయిన్​పై రష్యా రెండు రోజుల్లో దందయాత్ర చేస్తుందని అమెరికా తెలిపింది. తమ ప్రజలంతా ఆ దేశం నుంచి వచ్చేయాలని సూచించింది. వీలైనంత త్వరగా అమెరికన్లు బయల్దేరాలని పేర్కొంది.

White House says Russia could invade Ukraine within the week
'రెండు రోజుల్లో ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర- అమెరికన్లంతా వచ్చేయాలి'

By

Published : Feb 12, 2022, 9:22 AM IST

Updated : Feb 12, 2022, 12:16 PM IST

Russia invade Ukraine: ఉక్రెయిన్​లోని తమ ప్రజలంతా తక్షణమే స్వదేశం తిరిగి రావాలని అమెరికా సూచించింది. ఎక్కువ సమయం లేదని, వీలైనంత త్వరగా బయల్దేరాలని పేర్కొంది. ఉక్రెయిన్​పై రష్యా ఈ వారంలోనే దండయాత్ర చేస్తుందని తమకు స్పష్టమైన సమాచారం అందిందని తెలిపింది. ఈ వారంలో, లేదా 48 గంటల్లోనే రష్యా సైన్యం ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్​ వెల్లడించారు. చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్​ ముగిసేలోపు దాడి జరగొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Russia Ukraine War

దందయాత్ర చేయాలని రష్యా సైన్యానికి పుతిన్​ ఆదేశాలు జారీ చేశారని తాము చెప్పడం లేదని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే అదే జరిగే సూచనలు కన్పిస్తున్నాయి అమెరికా పేర్కొంది. నిఘా వర్గాలు ఈ మేరకు తెలిపాయని వివరించింది.

రాయబార కార్యాలయం ఖాళీ..

జాతీయ భద్రతా సలహాదారు సూచనతో ఉక్రెయిన్​ రాజధాని కియివ్​లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు అమెరికా అధికారులు. రష్యా ఏ క్షణమైనా దండయాత్ర చేసే అవకాశమున్నందున.. మరో 3000 బలగాలను పోలండ్​కు పంపాలని అమెరికా రక్షణమంత్రి ఆదేశించిన కాసేపటికే ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా బలగాలతో కలిపి తూర్పు ఐరోపాలో అమెరికా బలగాల సంఖ్య 6వేలకు చేరనుంది. జో బైడెన్​ సూచన మేరకే అదనపు బలగాలను పంపినట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

మరోవైపు రష్యా, ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు బ్రిటన్​ రక్షణమంత్రి మాస్కోను సందర్శించారు. యుద్ధం జరగకుండా ఆపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ట్రక్కుల ఆందోళన ఉద్ధృతం.. అమెరికా-కెనడా సరిహద్దు దిగ్బంధం

Last Updated : Feb 12, 2022, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details