తెలంగాణ

telangana

ETV Bharat / international

'శ్వేతసౌధంలో కరోనా విజృంభణకు ఆ సమావేశమే కారణం'

శ్వేతసౌధంలో కరోనా కలకలానికి కారణమైన సమావేశం వివరాలను అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. శ్వేతసౌధంలో సెప్టెంబర్​ 26న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రకటన సమావేశంలో వ్యాప్తి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎవరూ మాస్కులు ధరించకపోవటమే వ్యాప్తికి కారణమని స్పష్టం చేశారు.

Anthony Fauci
ఆంటోనీ ఫౌచీ

By

Published : Oct 10, 2020, 10:03 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వైరస్‌ సోకిన తర్వాత శ్వేతసౌధం వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారింది. చాలా మందికి కరోనా సోకడానికి కారణమైన సమావేశ వివరాలు అమెరికా అంటువ్యాధుల విభాగం చీఫ్, కరోనా కట్టడి కార్యదళ సభ్యుడు అంటోనీ ఫౌచీ వెల్లడించారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ వారసురాలిగా ఎమీ కోనీ బారెట్‌ను ప్రకటిస్తూ శ్వేతసౌధంలోని రోజ్​ గార్డెన్​లో ట్రంప్‌ గత నెల 26న భారీ కార్యక్రమం నిర్వహించారు. ఆ సమావేశమే వైరస్‌ వ్యాప్తికి కారణమైందని ఫౌచీ తెలిపారు. ఆ కార్యక్రమంలో ఎవరూ మాస్కులు ధరించలేదన్నారు. అందుకే వైరస్‌ చాలా మందికి సోకిందన్నారు. వైట్‌హౌస్‌లో కరోనా బారినపడ్డవారి వివరాలు చూస్తేనే ఇది స్పష్టమవుతోందన్నారు.

వారం తర్వాత..

శ్వేతసౌధంలో తొలుత ట్రంప్‌ సీనియర్‌ సలహాదారు హోప్‌ హిక్స్‌ కరోనా బారిన పడ్డట్లు నిర్ధరణ అయింది. ఆమెకు కరోనా సోకినట్లు ట్రంప్‌ అక్టోబర్‌ 2న ప్రకటించారు. అంటే సమావేశం జరిగిన దాదాపు వారం తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆమె అధ్యక్షుడికి సన్నిహితంగా మెలగడం వల్ల ట్రంప్‌ దంపతులు నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు.

వారికీ వైరస్‌ సోకినట్లు తేలింది. అనంతరం అధికార ప్రతినిధి కేలీ మెక్​ఎనానీ, సలహాదారులు స్టీఫెన్‌ మిల్లర్‌‌, నికోలస్‌ లూనా సహా ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన దాదాపు 12 మంది ఉన్నతాధికారులు కొవిడ్‌ బారిన పడ్డారు.

ఇదీ చూడండి:కరోనా వచ్చినా నిర్లక్ష్యంగానే ట్రంప్: బైడెన్

ABOUT THE AUTHOR

...view details