అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని అమెరికా భావిస్తున్న తరుణంలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ చివరికల్లా కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం కష్టమేనని అభిప్రాయపడ్డారు.
"నవంబర్, డిసెంబర్‌కు బదులుగా.. అక్టోబర్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే కరోనా కట్టడిలో నిపుణుల మార్గదర్శకాలను సరిగా పాటించకపోతే... దాని ప్రభావం మరి కొన్నాళ్ల పాటు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యంపై శాస్త్రీయ ఆధారాలు లేనిదే వినియోగానికి ఆమోదం లభించకూడదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన ఏడాది లోపు ప్రపంచం సాధారణ పరిస్థితికి చేరుకుంటుందని నా అంచనా."
- ఆంటోని ఫౌచి, అమెరికా అంటువ్యాధుల నిపుణులు
2021 ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశముందని ఆయన ఇదివరకే వెల్లడించారు ఫౌచి.
అమెరికాలో నవంబర్ 1 కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు పంపిణీ చేసేందుకు సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లను ఆదేశించింది. అయితే, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై పలువురు ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విమర్శల వెల్లువ..