తెలంగాణ

telangana

ETV Bharat / international

మీ వాట్సాప్​ హ్యాకైందా? చెక్​ చేసుకోండి! - వైరస్

సామాజిక మాధ్యమాల్లో విరివిగా వాడే యాప్​ వాట్సాప్​. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అలాంటి వాట్సాప్​లో లోపం కారణంగా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ఓ స్పైవేర్​ స్మార్ట్​ఫోన్లలో ఇన్​స్టాల్​ అయినట్లు సంస్థ ప్రకటించింది. వెంటనే యాప్​ అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది.

వాట్సాప్​లో గూఢచారి

By

Published : May 14, 2019, 4:54 PM IST

Updated : May 14, 2019, 6:02 PM IST

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ పెద్ద దుమారం చెలరేగింది. ఇందుకోసం ఫేస్​బుక్​ను వాడారని ఆరోపణలు వచ్చాయి. ఫేస్​బుక్​ వినియోగదారుల సమాచారం తస్కరించినట్లు సంస్థ ఒప్పుకుంది. ఇప్పుడు ఫేస్​బుక్​ అనుంబంధ సంస్థ వాట్సాప్​ ఇలాంటి చిక్కుల్లోనే పడింది. ఓ అధునాతన స్పైవేర్​ను వాట్సాప్​ ద్వారా పంపి చరవాణిల నుంచి వ్యక్తిగత సమాచారం దొంగలించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు​ సంస్థ ప్రకటించింది.

ఈ దాడి గురించి మొదటిగా 'ఫినాన్షియల్​ టైమ్స్'​ వార్త ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది వరకు వినియోగిస్తోన్న వాట్సాప్​ ద్వారా హ్యాకర్లు ఓ ప్రమాదకర సాఫ్ట్​వేర్​ను చరవాణిలకు పంపిస్తునట్లు వెల్లడించింది. ఈ స్పైవేర్​ను ఇజ్రాయల్​కు చెందిన ఓ సంస్థ తయారు చేసినట్లు తెలిపింది.

ఈ స్పైవేర్​ ఆండ్రాయిడ్​తో పాటు ఆపిల్​ ఐ ఫోన్​లపై ప్రభావం చూపనుందట. ఈ విషయాన్ని మే నెల మొదట్లోనే వాట్సాప్​ గుర్తించింది. ఇందుకోసమే 10 రోజుల్లో యాప్​ అప్​డేట్​ను తీసుకువచ్చింది.

"వినియోగదారులందరూ వాట్సాప్​ లేటెస్ట్​ వెర్షన్​కు అప్​గ్రేడ్​ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలానే చరవాణి ఆపరేటింగ్​ సిస్టమ్​ను ఎప్పటికప్పుడు అప్​ టూ డేట్​గా ఉంచుకోండి. మొబైల్​లోని సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారి నుంచి తప్పించుకోవడానికే ఈ సూచన."
-వాట్సాప్​ ప్రతినిధి

ఎంతమంది వినియోగదారులపై ఈ ప్రభావం ఉంది, ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదని వాట్సాప్​ తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి తెలియజేసినట్లు పేర్కొంది. అయితే కొంతమంది, వినియోగదారులపై మాత్రమే ఈ ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది. ఈ పనిచేస్తోంది ఓ ప్రైవేటు సంస్థని తెలిపింది. ఈ సంస్థ ప్రపంచంలోని పలు ప్రభుత్వాలతో పని చేస్తున్నట్లు పేర్కొంది వాట్సాప్. సంస్థ పేరు ప్రకటించలేదు.

'యూనివర్సిటీ ఆఫ్​ టొరోన్టో'లోని ఓ పరిశోధన విభాగం ఇటీవలే ఓ మానవహక్కుల సంఘానికి చెందిన న్యాయవాదిపై ఈ స్పైవేర్​ను ప్రయోగించారని ట్వీట్​ చేసింది. వాట్సాప్​ వెనువెంటనే స్పైవేర్​ను అడ్డగించినట్లు తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు, యాప్​ దుర్వినియోగం అవుతున్నట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని వాట్సాప్​ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: మీ ఐఫోన్​ 'లొకేషన్​ డేటా' భద్రమేనా?

Last Updated : May 14, 2019, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details