తెలంగాణ

telangana

By

Published : Sep 8, 2020, 5:00 PM IST

ETV Bharat / international

హ్యాండ్ శానిటైజర్​ ఇలా ఉంటేనే బెస్ట్!

కరోనా నియంత్రణ కోసం ఆల్కహాల్ మోతాదు ఎక్కువగా ఉన్న హ్యాండ్​ శానిటైజర్లను ఉపయోగించాలని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం సూచించింది. సబ్బు, నీళ్లతో చేతులను కడగటం కంటే హ్యాండ్​ శానిటైజర్లను వాడటం చాలా ఉత్తమమని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

What should I look for in a hand sanitiser?
ఈ హ్యాండ్ శానిటైజర్లను వాడటమే ఉత్తమం!

కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ శానిటైజర్లను ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో రకరకాల శానిటైజర్లు వస్తున్నాయి. అయితే ఎటువంటి వాటిని ఉపయోగించాలి? అనేది చాలా మంది అనుమానం. వీటిని నివృతి చేసేలా కీలక సూచనలు చేసింది అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం. ఆల్కహాల్ మోతాదు ఎక్కువ ఉన్న శానిటైజర్లను వాడాలని సిఫార్సు చేసింది. వాటిలో ఆల్కహాల్​తోపాటు శుద్ధిచేసిన డిస్టిల్డ్ వాటర్, హైడ్రోజన్​ పెరాక్సైడ్, గ్లిసరిన్​ ఉండొచ్చని తెలిపింది.

మరి కొన్ని సూచనలు...

  • చేతులను శుభ్రం చేసే శానిటైజర్లలో కనీసం 60 శాతం ఇథైల్ ఆల్కహాల్ లేదా 70 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉన్న వాటిని ఎంచుకోవాలి.
  • మిథనాల్, 1-ప్రొపనాల్​తో రెండు విషపూరితమైనవి కాబట్టి అవివి ఉన్న వాటికి దూరంగా ఉండాలి.
  • బెంజల్​కోనియమ్​ క్లోరైడ్​తో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించకూడదు. బ్యాక్టీరియా, వైరస్​లను ఇవి నాశనం చేయలేవు.
  • ఆహారం, పానీయాల డబ్బాలలో శానిటైజర్లను నిల్వ చేయకూడదు. పొరపాటున తాగితే ప్రమాదం.
  • సొంతంగా శానిటైజర్లను తయారు చేయడం శ్రేయస్కరం కాదు. రసాయనాలను ఉపయోగించేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే శరీరం కాలే ప్రమాదం ఉంటుంది.

శానిటైజర్లే మేలు...

సబ్బు, నీళ్లతో చేతులను శుభ్రం చేయటం కంటే హ్యాండ్​ శానిటైజర్లను ఉపయోగించటం చాలా మంచిదని కొలంబియా విశ్వవిద్యాలయంలోని అంటువ్యాధుల శాస్త్రవేత్త బారున్​ మాథెమా తెలిపారు. సూక్ష్మజీవులను నాశనం చేయటంలో హ్యాండ్​ శానిటైజర్లు బాగా ఉపయోగపడతాయని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details