తెలంగాణ

telangana

ETV Bharat / international

మరో 'ఫ్లాయిడ్'​ ఉదంతం- నల్లజాతీయుడిపై కాల్పులు! - నల్లజాతీయుడిపై దౌర్జన్యం

అమెరికాలో ఇటీవల పోలీసుల దాష్టీకానికి బలైన జార్జి ఫ్లాయిడ్​ ఘటన మరువకముందే అగ్రరాజ్యంలో అలాంటి ఉదంతమే మళ్లీ జరిగింది. ఓ నల్లజాతీయుడిని పోలీసు అధికారి స్టన్​గన్​తో కాల్చాడు.

Virginia officer
మరో 'ఫ్లాయిడ్'​ ఉదంతం- నల్లజాతీయుడిపై కాల్పులు

By

Published : Jun 8, 2020, 11:06 AM IST

అగ్రరాజ్యంలో 'బ్లాక్​ లివ్స్​ మేటర్' ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. జార్జి ఫ్లాయిడ్​ మృతికి నిరసనగా అమెరికా వ్యాప్తంగా నిరసనజ్వాలలు చెలరేగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం మరో ఫ్లాయిడ్​ ఉదంతాన్ని కళ్లకు కట్టింది.

మరో 'ఫ్లాయిడ్'​ ఉదంతం

ఏమైంది..?

వర్జీనియా రాష్ట్రం ఫైర్​ఫేక్స్ నగరంలో ఓ​ పోలీసు అధికారి ఓ నల్లజాతీయుడిపై స్టన్​గన్​ ఉపయోగించాడు. ఓ వ్యక్తి వీధుల్లో ఆక్సిజన్​ కావాలని అరుస్తూ తిరుగుతున్నట్లు పోలీసులకు ఫోన్​ వచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు సదరు నల్లజాతీయుడ్ని అంబులెన్స్​ ఎక్కమన్నారు.

ఈ లోపు టైలర్​ టింబర్​లేక్ అనే తెల్లజాతీయుడైన పోలీసు అధికారి​ ఆ వ్యక్తిని కిందకు నెట్టి.. అతడి చేతులు వెనక్కి విరిచిపైన కూర్చొన్నాడు. వెంటనే స్టన్​గన్​ తీసి నల్లజాతీయుడి మెడపై కాల్పులు జరిపాడు. నొప్పిని తాళలేక ఆ వ్యక్తి అరవగా.. మళ్లీ కాల్చాడు.

మరో 'ఫ్లాయిడ్'​ ఉదంతం
మరో 'ఫ్లాయిడ్'​ ఉదంతం
మరో 'ఫ్లాయిడ్'​ ఉదంతం

ఈ దృశ్యాలు పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. సదరు పోలీస్​ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఘటనను ఖండించిన ఉన్నతాధికారులు సదరు అధికారి నిబంధనలను అతిక్రమించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఆ నల్లజాతీయుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం విడుదల చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details