తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్‌ నివారణకు ముక్కు ద్వారా టీకా! - ARAVAX THERAPATICS

ముక్కు ద్వారా అందించే టీకా అభివృద్ధి కోసం.. ఓ భారతీయ అమెరికన్​ శాస్త్రవేత్తతో చేతులు కలిపింది హ్యూస్టన్​ విశ్వవిద్యాలయం(యూహెచ్​). శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమయ్యే కరోనా వంటి వైరస్​లను నిలువరించేందుకు ఓ వినూత్న టీకాను ఆరావ్యాక్స్​ థెరపాటిక్స్​ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. దీనిని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు యూహెచ్​.. ఈ కంపెనీతో కలిసి పనిచేయనుంది.

Vaccine through the nose for the prevention of covid
కొవిడ్‌ నివారణకు ముక్కు ద్వారా టీకా!

By

Published : Oct 15, 2020, 6:10 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ మహమ్మారికి ముకుతాడు వేసే టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త ఒకరు కీలక ముందడుగు వేశారు. ముక్కు ద్వారా అందించే ఈ టీకా అభివృద్ధి కోసం ఆయనతో హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయం (యూహెచ్‌) తాజాగా చేతులు కలిపింది.

ఆరావ్యాక్స్‌ థెరపాటిక్స్‌ అనే బయోటెక్‌ కంపెనీకి నవీన్‌ వరదరాజన్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమయ్యే కరోనా వంటి వైరస్‌లను నిలువరించేందుకుగాను ఓ వినూత్న టీకాను ఆ కంపెనీ ప్రాథమికంగా అభివృద్ధి చేసింది.

''మానవ శరీరంలోకి ప్రవేశించే భాగం వద్దే వైరస్‌లను తుదముట్టించాలన్నది మా లక్ష్యం. అందుకే నాసికా కుహరం ద్వారా అందించే టీకాను తయారుచేశాం. ఇది శ్లేష్మ పొరలో రోగ నిరోధక ప్రతిస్పందన వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాదు, శరీరమంతటా రోగ నిరోధక సామర్థ్యాన్ని పెంచుతుంది. సాధారణంగా కరోనా వంటి వైరస్‌లు స్పైక్‌ ప్రొటీన్ల సహాయంతో ఆతిథ్య కణాల్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి ఆ ప్రొటీన్లను నాశనం చేసేలా మేం టీకాను రూపొందించాం.'' అని వరదరాజన్‌ వివరించారు. టీకాను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు యూహెచ్‌తో కలిసి పనిచేయనుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details