తెలంగాణ

telangana

ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓ చేతికి 2 బిలియన్ల టీకా డోసులు

వివిధ దేశాలకు కొవిడ్ టీకాలు త్వరితగతిన పంపిణీ చేసేందుకు తమ వద్ద 2 బిలియన్ల వ్యాక్సిన్లు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 190 దేశాలకు టీకాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య రంగం చరిత్రలో ఇదో మైలురాయని వెల్లడించింది.

Vaccine programme gets access to nearly 2 billion doses says WHO
'పంపిణీకి 2 బిలియన్ల కొవిడ్ టీకాలు సిద్ధం'

By

Published : Dec 19, 2020, 9:00 AM IST

అన్ని దేశాలకు కరోనా టీకా పంపిణీ చేయాలన్న తమ లక్ష్యంలో పురోగతి సాధించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​ టెడ్రోస్​ అథనోమ్​ తెలిపారు. ఆశాజనకంగా ఉన్న టీకాలకు సంబంధించి.. దాదాపు 2 బిలియన్ల డోసులు సంస్థ వద్ద అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. 'కొవాక్స్​' సహాయంతో వచ్చే ఏడాది తొలి భాగంలో 190 దేశాలకు వీటిని అందించే అవకాశమున్నట్టు స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య రంగం విషయంలో ఇదో మైలురాయి అని అభివర్ణించారు.

కొవాక్స్​, ఇతర ఫార్మా సంస్థల అధికారులతో మీడియా సమావేశానికి హాజరయ్యారు టెడ్రోస్. ప్రపంచ ఆరోగ్యసంస్థ, కొవాక్స్​లో భాగస్వామ్యం ఉన్న ఇతర సంస్థలు టీకా పంపిణీ త్వరితగతిన జరిపేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాయని అన్నారు. వైరస్​ వ్యాప్తిని అరికట్టడంలో ఈ టీకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు. కరోనా త్వరలోనే అంతమైపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ టీకాల పంపిణీలో ఆస్ట్రాజెనికా, జాన్స​న్​-జాన్సన్​, భారత్​కు చెందిన సీరమ్​ మొదలైన సంస్థలు ఆరోగ్య సంస్థ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. అయితే మోడెర్నా, ఫైజర్​, బయో ఎన్​టెక్ సంస్థలు ఇందులో భాగస్వాములుగా లేకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి:మాపై మెరుపుదాడులకు భారత్ ప్రణాళిక: పాక్​

ABOUT THE AUTHOR

...view details