తెలంగాణ

telangana

ETV Bharat / international

'సోషల్' వివరాలు ఇస్తేనే​ అమెరికా వీసా - అమెరికా

అమెరికా వెళ్లాలంటే ఇకపై తాము వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల ఖాతా వివరాలు వెల్లడించాల్సిందే. ఈ మేరకు వీసా జారీలో కొత్త నిబంధన తీసుకొచ్చింది అగ్రరాజ్యం.

అమెరికా వెళ్లాలంటే సోషల్​ మీడియా వివరాలు చెప్పాల్సిందే

By

Published : Jun 2, 2019, 5:02 PM IST

Updated : Jun 2, 2019, 6:11 PM IST

'సోషల్' వివరాలు ఇస్తేనే​ అమెరికా వీసా

అమెరికా వెళ్లాలనుకునే వారు ఇకపై తమ వ్యక్తిగత వివరాలతో పాటు తాము వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల ఖాతా వివరాలనూ అందజేయాలి. ఈ మేరకు ట్రంప్​ ప్రభుత్వం శనివారం కొత్త నిబంధన తీసుకొచ్చింది.

తాత్కాలిక పర్యటకులతో పాటు దాదాపు అన్ని వీసా దరఖాస్తులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇందుకోసం డ్రాప్​ డౌన్​ మెనూను అందుబాటులోకి తెచ్చారు.

తప్పుడు సమాచారం ఇస్తే అంతే...

సోషల్​ మీడియా వినియోగించని వారికోసం ఒక వెసులుబాటు కల్పించారు. తాము ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో లేమని తెలిపేందుకు అవకాశం ఇచ్చారు. కానీ వీసా దరఖాస్తుదారు తప్పుడు సమాచారం అందిస్తే ఇమిగ్రేషన్ సమయంలో తీవ్ర​ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.

ప్రస్తుతం కొన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలనే డ్రాప్​డౌన్​ మెనూలో ఉంచారు. త్వరలోనే ఇతర సైట్లనూ మెనూలో చేర్చుతామని అధికారులు తెలిపారు.

"అమెరికా రావాలనుకుంటున్న విదేశీయులను తనిఖీ చేసేందుకు ఇది కీలకమైన ముందడుగు. తీవ్రవాదానికి ప్రధాన మార్గంగా సోషల్​ మీడియా ఉందని కొన్ని సంవత్సరాలుగా మేము గమనించాం. ఈ నిబంధన అమెరికాలోకి ప్రవేశించాలనుకుంటున్న తీవ్రవాదులు, ఇతర ప్రమాదకర వ్యక్తులను అడ్డుకునేందుకు ఇది కీలక సాధనంగా మారనుంది."

- పోలీసు అధికారి.

వీసా జారీలో తనిఖీలు ముమ్మరం చేసేందుకు 2017 మార్చిలోనే పలు విధానలపై ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.

ఇదీ చూడండి: హువావేతో జాగ్రత్త: బ్రిటన్​కు ట్రంప్ హెచ్చరిక

Last Updated : Jun 2, 2019, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details