తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్ నుంచి రాకపోకలపై అమెరికా ఆంక్షలు - భారత్

మే4 నుంచి భారత్ నుంచి వచ్చే రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. భారత్​లో కరోనా కేసులు పెరుగుతున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

America
అమెరికా

By

Published : May 1, 2021, 5:29 AM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాల రాకపై అమెరికా పరిమితులు విధించింది. మే 4 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు.

గత 14 రోజులుగా భారత్‌లో ఉంటున్న అమెరికా పౌరులు కాని వారు తమ దేశంలోకి రావడానికి వీల్లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా పౌరులు, గ్రీన్‌ కార్డు దారులు, వారి భార్యలు, 21లోపు పిల్లలకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. తదుపరి ఆదేశాల వరకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టంచేశారు.

భారత్‌లో వెలుగు చూస్తున్న కొవిడ్‌ కేసుల్లో వైరస్‌ లోడు తీవ్రంగా ఉంటోందని అమెరికా ప్రజారోగ్య సంస్థ చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. శ్వేతసౌధం తెలిపింది. భారత్‌ నుంచి తమ దేశంలోకి వచ్చే విమానాల రాకపై ఇప్పటికే బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, యూఏఈ వంటి దేశాలు ఆంక్షలు విధించాయి.

ఇదీ చదవండి:బస్సు, కారు ఢీ- ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details