తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​ మాకు సాయం చేసింది.. మేమూ చేస్తాం'

కరోనాపై పోరాటంలో భాగంగా భారత్​కు సాయం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఈ విషయపై ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

joe biden
బైడెన్, అమెరికా అధ్యక్షుడు

By

Published : Apr 28, 2021, 8:58 AM IST

కరోనాతో అల్లాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు బైడెన్‌ స్పష్టం చేశారు. కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించినట్లు తెలిపారు. మహమ్మారితో గతేడాది తమ దేశం ఇబ్బందుల్లో ఉన్నపుడు భారత్‌ కూడా తమకు ఇదే తరహాలో సాయం చేసిందని బైడెన్‌ గుర్తు చేశారు. నొవావాక్స్‌ సహా పలు ఇతర రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావాల్సి ఉందని, అవి రాగానే అవసరమైన దేశాలకు అందించే దశకు చేరుకుంటామని బైడెన్‌ తెలిపారు.

"భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేను సుదీర్ఘంగా మాట్లాడాను. భారత్‌కు అవసరమైన పూర్తి సాయాన్ని వెంటనే అందజేస్తున్నాం. రెమ్‌డెసివిర్‌ సహా వైరస్‌ను ఎదుర్కొనే అన్ని రకాల ఔషధాలను పంపిస్తున్నాం. అనారోగ్యం నుంచి కోలుకునే సాయం చేస్తున్నాం. వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన యంత్ర పరికరాలను పంపిస్తున్నాం. వ్యాక్సిన్‌ను ఎప్పుడు పంపించగలం అన్న అంశంపైనా మేం చర్చిస్తున్నాం. మొదట్లో మేం కష్టాల్లో ఉన్నపుడు భారత్‌ మాకు సాయం చేసింది."

-- జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడు.

ఇదీ చదవండి:ప్రభుత్వ వైఫల్యంతోనే సంక్షోభం: ప్రియాంక

ABOUT THE AUTHOR

...view details