తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​ అంశంపై భారత పర్యటనకు యూఎస్​ సెనేటర్​ - కశ్మీర్​ అంశంపై భారత పర్యటనకు యూఎస్​ సెనేటర్​

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం భారత్​-పాకిస్థాన్​ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు అమెరికా సెనేటర్​ మెగీ హసన్​. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో పర్యటించిన ఆమె... భారత్​కు వస్తున్నట్టు ట్వీట్ చేశారు.

కశ్మీర్​ అంశంపై భారత పర్యటనకు యూఎస్​ సెనేటర్​

By

Published : Oct 11, 2019, 9:33 AM IST

కశ్మీర్​ అంశంపై భారత్​-పాకిస్థాన్​ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చారు అమెరికా సెనేటర్​ మాగీ హసన్​. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ట్వీట్​ చేశారు.

ఇటీవలే పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే)లో పర్యటించారు న్యూ ఇంగ్లాండ్​ సెనేటర్​ మెగీ హసన్​. పీఓకేను సందర్శించిన అనంతరం ఆఫ్గానిస్థాన్​, పాకిస్థాన్​లో పర్యటించారు. ఇప్పుడు భారత్​ రానున్నారు.

పాక్​ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​, సైన్యాధిపతి జనరల్​ కమర్​ జావెద్​ భజ్వతో సమావేశమయ్యారు మెగీ. తీవ్రవాద వ్యతిరేక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వంపై చర్చించారు.

మెగీ హసన్​ ట్వీట్​

" పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లో మేము పర్యటించాం. కశ్మీర్​లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరువైపులా పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్గాలను కనుగొనడం చాలా క్లిష్టమైన పని. ప్రస్తుతం నేను భారత పర్యటనకు వెళుతున్నాను. అక్కడ ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమై కశ్మీర్​లో పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్యంపై చర్చించనున్నా"

- మెగీ హసన్​,న్యూ ఇంగ్లాడ్​ సెనేటర్​, అమెరికా

ఇదీ చూడండి: న్యూయార్క్​ రోడ్డుపైకి పడవ వచ్చింది!

ABOUT THE AUTHOR

...view details