తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉత్తర కొరియాకు అమెరికా ప్రత్యేక రాయబారి - దక్షిణ కొరియా గురించి బైడెన్​

ఉత్తర కొరియాకు ప్రత్యేక రాయబారిని నియమించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్​ జే ఇన్​​తో సమావేశం అనంతరం ప్రత్యేక రాయాబారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

joe biden, us president
బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

By

Published : May 22, 2021, 12:23 PM IST

ఉత్తరకొరియాకు ప్రత్యేక రాయబారిని నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ప్రకటించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్​ జే ఇన్​​తో జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

"దౌత్యవేత్త, దేశాల మధ్య లోతైన విధానాల అనుభవజ్ఞుడు సంగ్​ కిమ్​ను ఉత్తరకొరియాకు ప్రత్యేక రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన డీపీఆర్​కే(డిప్లొమాటిక్​ పీపుల్స్​ రిపబ్లిక్ ఆఫ్​ కొరియా- ఉత్తరకొరియా)కు రాయబారిగా వ్యవహరిస్తారు.

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

డీపీఆర్​కే(ఉత్తరకొరియా) అధికార యంత్రాంగాన్ని సమీక్షించేందుకు తన బృందం.. మూన్​ బృందాన్ని సంప్రదించిందని జో బైడెన్​ తెలిపారు. తాజా పరిస్థితులపై తామిద్దరం లోతుగా చర్చించామని పేర్కొన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేలా.. అణ్వాయుధాలను నిర్వీర్యం చేసేందుకు ఉపకరించేలా... ఉత్తరకొరియాతో దౌత్యపరమైన సంప్రదింపులను తాము కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొరియా ప్రాంతంలో పూర్తి అణ్వాయుధాలను నిర్వీర్యం చేయడం.. శాంతిని నెలకొల్పడమే.. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి లక్ష్యమని మూన్​ జే ఇన్​​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన కెనడా

ABOUT THE AUTHOR

...view details