తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో రాజకీయ పార్టీల 'స్ట్రా'ల యుద్ధం - స్ట్రా

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డొనాల్డ్​ ట్రంప్ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఆన్​లైన్​లో ట్రంప్ బ్రాండ్ పేరుతో వివిధ రకాల వస్తువులను విక్రయిస్తున్నారు. తాజాగా లిబరల్ పార్టీ పేపర్ స్ట్రాకు దీటుగా ట్రంప్ అధికారిక ప్రచార వెబ్​సైట్​ ద్వారా ప్లాస్టిక్ స్ట్రాలను అమ్ముతున్నారు అయన మద్దతుదారులు.

ఆన్​లైన్​లో అమ్మకానికి ట్రంప్​ బ్రాండ్ 'ప్లాస్టిక్​​ స్ట్రా'

By

Published : Jul 28, 2019, 10:26 AM IST

Updated : Jul 28, 2019, 3:11 PM IST

ఆన్​లైన్​లో అమ్మకానికి ట్రంప్​ బ్రాండ్ 'ప్లాస్టిక్​​ స్ట్రా'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, ఆయన మద్దతుదారులు​ 2020 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ట్రంప్ బ్రాండ్ పేరుతో వివిధ రకాల​ వస్తువులను ఆన్​లైన్​లో విక్రయిస్తూ ప్రచారాన్ని, నిధుల సేకరణనూ ఏకకాలంలో చేపట్టారు.

పేపర్​ వర్సెస్​ ప్లాస్టిక్​

లిబరల్​ పార్టీ పేపర్​​ స్ట్రాలకు దీటుగా ట్రంప్​ బ్రాండ్​ ప్లాస్టిక్​ స్ట్రాలు అమ్ముతున్నారు ఆయన మద్దతుదారులు. ట్రంప్ అధికారిక ప్రచార వెబ్​సైట్​లో పది స్ట్రాలు ఉన్న ప్యాక్​ను 15 డాలర్లకు విక్రయిస్తున్నారు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.

లిబరల్ పార్టీని ఎద్దేవా చేస్తూ... ట్రంప్ ప్రచార నిర్వహకుడు 'లిబరల్ ప్రోగ్రెస్' హ్యాష్​టాగ్​తో నలిగిన కాగితపు స్ట్రాను పోస్ట్ చేశారు.
" అమెరికా ఆర్థికవ్యవస్థను కూడా వారు ఇలానే చేస్తారు. అందుకే వారిని(లిబరల్ పార్టీ​) అధికారంలోకి రాకుండా చూడాలి" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదీ చూడండి: 'అవినీతిని ప్రోత్సహించేలా ఆర్టీఐకి సవరణలు'

Last Updated : Jul 28, 2019, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details