కరోనా వైరస్ తయారీలో అమెరికా చాలా ముందడుగు వేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కరోనాపై పోరులో ఎంతో పురోగతి సాధించామని, చికిత్స విధానంలోనూ కీలక దశల్లో ఉన్నట్లు తెలిపారు.
"వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఒక శుభవార్త ఉంది. వ్యాక్సిన్ తయారీలో చాలా వేగంగా ముందుకు సాగుతున్నాం. చికిత్సకు సంబంధించి కూడా ఎంతో పురోగతి సాధించాం. నేను ఫలితాలు చూశాను. పరిశోధకులతో కలిసి మాట్లాడాను. వాళ్లు చాలా తెలివైనవాళ్లు. ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిన గొప్పవాళ్లు. చైనా ఇది జరగకూడదని భావించింది. కానీ మేం సాధిస్తున్నాం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
చాలా ప్రాంతాల్లో వ్యాధి అదుపులోకి వస్తోందని ట్రంప్ తెలిపారు. వైరస్ను అర్థం చేసుకున్నామని, న్యూజెర్సీలో మరణించిన 12 వేల 500 మందిలో 18 ఏళ్లలోపు వ్యక్తి ఒక్కరే ఉన్నారని వెల్లడించారు.