US Job Openings: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఉన్నప్పటికీ.. జనవరిలో అమెరికాలో 4,67,000 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఆ దేశ కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. డిసెంబరుతో పోలిస్తే నిరుద్యోగ రేటు 3.9 నుంచి 4 శాతానికి పెరిగింది.
US Job Openings: ఒక్కనెలలో 4,67,000 మందికి ఉద్యోగాలు
US Job Openings: అమెరికాలో జనవరిలో 4.67 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు ఆ దేశ కార్మిక శాఖ వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఉన్నప్పటికీ.. అంచనాలకు మించి నియామకాలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
US Job Openings
ఊహించినదానికి మించి నియామకాలు జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నియామకాలపై వాణిజ్య సంస్థల యాజమాన్యాల్లో ఉన్న ఆత్రుతకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తాత్కాలికమే అనే భావనతో సంస్థలు ఉన్నాయని, దీర్ఘకాల వృద్ధిపై ఆశావహ దృక్పథంతోనే నియామకాలు చేపట్టినట్టుగా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:Plane Crash: కుప్పకూలిన విమానం- ఏడుగురు మృతి