జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై యూఎస్ ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానాన్ని 332-95 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ వ్యతిరేకించింది.
ప్రతినిధుల సభలో వీగిపోయిన ట్రంప్ అభిశంసన - సభ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ ప్రతినిధుల సభలో ప్రవెశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. 332-95 ఓట్ల తేడాతో డెమోక్రటిక్ సభ్యుడు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ వ్యతిరేకించింది.
నలుగురు మహిళా ప్రతినిధులపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ డెమొక్రటిక్ సభ్యుడు, టెక్సాస్ ప్రతినిధి అల్ గ్రీన్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లే అధికం. రాజకీయ విభేదాలున్నప్పటికీ ట్రంప్ అభిశంసనకు మెజారిటీ డెమొక్రాట్లు మొగ్గుచూపక పోవడం గమనార్హం.
సభ నిబంధనల ప్రకారం ఒక్క సభ్యుడైనా అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు. గతంలోనూ గ్రీన్ రెండు సార్లు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి విఫలమయ్యారు. ఈ అభిశంసన విఫలమైనప్పటికీ.. సభలో ప్రభావం చూపిందని గ్రీన్ అభిప్రాయపడ్డారు.
అభిశంసన తీర్మానం వీగిపోయినట్లు గ్రీన్ విల్లేలో జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్ పేర్కొన్నారు. డెమొక్రాట్లకు కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చూడండి: 'అమెరికా ఒత్తిడితోనే హఫీజ్ సయిూద్ అరెస్ట్'