తెలంగాణ

telangana

ETV Bharat / international

అగ్రరాజ్యంలో చలిని మించిన ఎండ

అమెరికాలో చలి తీవ్రతను మించి వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. చలి పెరుగుదలతో పోలిస్తే వేసవిలో రెండింతల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఓ వార్తా సంస్థ చేసిన సర్వేలో తేలింది.

By

Published : Mar 20, 2019, 5:20 AM IST

అగ్రరాజ్యంలో చలిని మించిన ఎండ

అమెరికా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ప్రపంచంలోని శీతల దేశాల్లో అమెరికా ఒకటి. శీతకాలంలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీనికి భిన్నంగా చలిని మించి వేసవి ఉష్ణోగ్రతల పెరుగుదల అధికంగా ఉంటోందని ఓ వార్తా సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ సంకేతాలు భూతాపానికి అసలైన సూచికగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

"మేం 48 రాష్ట్రాల్లోని వాతావరణ కేంద్రాల్లో పరిశీలించాం. 99 ఏళ్లుగా రికార్డు చేసిన గణాంకాలను పరిశీలించాం. క్రమం తప్పకుండా నమోదు చేసిన 424 కేంద్రాలను ప్రామాణికంగా తీసుకున్నాం. వీటిని అధ్యయనం చేయగా గత 20 ఏళ్లుగా చలి తీవ్రతతో పోలిస్తే ఎండ పెరుగుదల అధికంగా నమోదవుతూ వస్తోంది. పశ్చిమం, నైరుతి, ఈశాన్య రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా మూడు రెట్లు అధికంగా ఉంది. "

-సెత్ బోరెన్​స్టీన్​, వార్తా సంస్థ విజ్ఞాన విభాగం

1999 నుంచి చలి తీవ్రతను మించి ఎండ పెరుగుతోంది. గడిచిన 16 ఏళ్లలో రోజువారి ఉష్ణోగ్రతలు సైతం రెట్టింపు అయ్యాయి. ఈ సమాచారాన్ని చాలా మంది వాతావరణ వేత్తలతో వార్తా సంస్థ పంచుకుంది.

"యాభై ఏళ్లుగా నేను గమనిస్తున్నాను. కాలం గడుస్తున్న కొద్దీ తక్కువ, ఎక్కువ ఉష్ణోగ్రతల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. పాసాడేనా పట్టణం గ్లోబల్ వార్మింగ్​కు కేంద్ర బిందువుగా ఉంది."

-పాల్ వెన్న్​బర్గ్, లిండే ప్రపంచ వాతావరణ సంస్థ డైరెక్టర్

దక్షిణ కాలిపోర్నియాలోని పాసాడేనాలో 7,203 రోజుల పాటు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చివరగా 1999 జూన్​ 5న తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 23న రికార్డయింది. దీనికంతటికీ భూతాపమే కారణమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం వేసవి ఎండల కారణంగా 22 రాష్ట్రాల్లో సగటున 36,000 మంది ఏటా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details