ఇరాన్ ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్‌లో.. శుద్ధి పనులను తిరిగి ప్రారంభించిన ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించింది అమెరికా. పోర్డో న్యూక్లియర్ ప్లాంట్‌పై ఇటీవల ప్రకటించిన ఆంక్షల మాఫీని రద్దు చేస్తున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.
'యురేనియం శుద్ధిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు. అందువల్ల పోర్డో ప్లాంట్‌పై అమెరికా ప్రకటించిన ఆంక్షల మాఫీని రద్దు చేస్తున్నాం. ఇది డిసెంబర్ 15, 2019 నుంచి అమలులోకి వస్తుంది. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న అతి పెద్ద దేశానికి అవసరమైన యురేనియం శుద్ధి సున్నా మాత్రమే.'
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.