ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) సభ్యత్వంతో అమెరికా, చైనా దేశాలు భారీగా లబ్ధిపొందినట్టు బెర్టెల్స్మన్ ఫౌండేషన్ సంస్థ పరిశోధనలో తేలింది. డబ్ల్యూటీఓ సభ్యత్వం వల్ల అమెరికా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 87 బిలియన్ డాలర్లు పెరిగిందని తెలిపింది. డబ్ల్యూటీఓలో అమెరికాకు 25ఏళ్లుగా సభ్యత్వం ఉంది.
2001లో డబ్ల్యూటీఓలో చేరిన చైనా.. వృద్ధిలో 86 బిలియన్ డాలర్లు లబ్ధి పొందింది. జర్మనీ 66 బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
డబ్ల్యూటీఓను స్థాపించి రేపటితో(జనవరి 1)తో 25ఏళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం ఈ సంస్థలో 164 సభ్య దేశాలు ఉన్నాయి.