2018 వరకు ఉగ్రవాద సంస్థలు, ఉగ్ర సంబంధిత వ్యక్తులకు చెందిన 46 మిలియన్ డాలర్ల నిధులను అమెరికా నిరోధించింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య ఖజానా శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో పాకిస్థాన్ ఆధారిత ఉగ్రసంస్థలు కూడా ఉన్నాయి.
లష్కరే తోయిబాకు చెందిన 4 లక్షల డాలర్లు, జైషే మహ్మద్‌కు చెందిన 1,725 డాలర్లపై అమెరికా అడ్డుకట్ట వేసినట్టు నివేదిక తెలిపింది.
ఉగ్రవాద సంస్థల ఆస్థులపై ఆంక్షలు విధించే అంశాన్ని ఖజానా శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం(ఓఎప్ఏసీ) పర్యవేక్షిస్తోంది. జాతీయ భద్రత, అమెరికా విదేశీ విధానాల ఆధారంగా ఈ ఆంక్షలు ఉంటాయి.