హెచ్-1బీ వీసాదారుల కోసం అమెరికా సరికొత్త కార్యక్రమం ప్రవేశపెట్టింది. మధ్య, ఉన్నత స్థాయి నైపుణ్యాలున్న హెచ్-1బీ వీసాదారులకు వృత్తి శిక్షణ కోసం పెట్టుబడులకు సిద్ధమైంది. ఇందుకోసం 15 కోట్ల డాలర్లు (రూ.1,110 కోట్లు) కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
'హెచ్-1బీ వన్ వర్క్‌ఫోర్స్ గ్రాంట్' పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది అమెరికా కార్మిక శాఖ. ప్రస్తుత పరిస్థితుల్లో 'ఒకే శ్రామిక శక్తి' విధానంలో ఆలోచించాలని కార్మిక శాఖ పేర్కొంది. ఐటీ, సైబర్ భద్రత, అధునాతన తయారీ రంగం, రవాణా రంగాలు ఇందులో ముఖ్యమైనవి.