తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ రోజు.. జోలపాట అలా ఆగిపోయింది'

బ్రిటీష్​​ రాజ వంశాంకురం తన గర్భంలోనే దూరమైన దుర్ఘటనను ప్రిన్స్​ హ్యారీ శ్రీమతి మేఘాన్​ మర్కెల్ గుర్తుచేసుకున్నారు. గర్భస్రావం జరగడం వల్ల తాను, తన భర్త విపరీతమైన బాధను అనుభవించామంటూ చెప్పుకొచ్చారామె. బ్రిటీషు రాజభోగాలు వదులుకొన్నాక.. ప్రిన్స్​ హ్యారీ దంపతులు ఓ బాబుతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు.

MRS PRINCE HARRY SHARED THE GRIEF
ఆ రోజు.. జోలపాట ఆగిపోయింది

By

Published : Nov 26, 2020, 7:16 AM IST

'అది జులై నెల.. ఆ రోజు ఉదయం ఎప్పటిలా తెల్లారింది. అల్పాహారం తయారుచేశా. కుక్కులకు తిండి పెట్టా. విటిమన్​ మాత్రలు తీసుకొన్నా. టేబుల్​ కిందపడ్డ క్రేయాన్​ వెలికితీశా. బాబును ఎత్తుకునే ముందు జుట్టు ముడివేశా. బాబుకు డైపర్​ మార్చాక.. నాకు ఏదో ఇబ్బందిగా అనిపించింది. చేతుల్లో ఉన్న బాబుతో నేలపై అలాగే కూలబడ్డా. ఏదో అనర్థం జరిగిందని తోచగానే నా నోటి నుంచి వెలువడుతున్న జోలపాట ఆగిపోయింది. బాబును గట్టిగా పట్టుకున్నా.. నా కడుపులో పెరుగుతున్న రెండో చిన్నారి ఇక లేదు అని నాకు అర్థమైపోయింది'.. బ్రిటీష్​ రాజ వంశాంకురం తల్లిగర్భంలోనే దూరమైన దుర్ఘటనను అమెరికన్​ మాజీ నటి అయిన మేఘాన్​ మర్కెల్​(39) ఇలా గుర్తు చేసుకున్నారు.

ఈ గర్భస్రావంతో తాను, తన భర్త ప్రిన్స్​ హ్యారీ 'భరింపనలవి కాని బాధ' అనుభవించామంటూ చెప్పుకొచ్చారామె. బ్రిటీషు రాజభోగాలు వదులుకొన్నాక.. ప్రిన్స్​ హ్యారీ దంపతులు ఏడాదిన్నర బాబు ఆర్చీతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. తమ జీవితంలోని విషాదఘట్టాన్ని వివరిస్తూ.. 'ది న్యూయార్క్​ టైమ్స్​'కు వ్యాసం రాశారు మేఘాన్​.

'మేము పంచుకునే నష్టాలు' పేరుతో..

'ఆ రోజు నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. భగ్న హృదయంతో పక్కన నిలబడ్డ నా భర్త చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఆ స్పర్శలో వెచ్చదనం నాకు తెలుస్తూనే ఉంది. కన్నీటితో అతని చేతిని ముద్దాడాను. ఈ విషాదం నుంచి బయటపడటం ఎలాగో తెలియక ఆసుపత్రి గోడలవైపు చూస్తూ ఉండిపోయా. ఆ తర్వాత మాకు తెలిసిందేమిటంటే.. దాదాపు వంద మంది మహిళలున్న ఆ ప్రసూతి గదిలో పది నుంచి ఇరవై మంది వరకు మాలాగా అభాగ్యులే అని' అంటూ మేఘాన్​ మర్కెల్​ వివరించారు. 'మా బాధ ఎటో వెళ్లిపోయింది. మాటలు మూగబోయాయి. సిగ్గుతో కుచించుకుపోయాం. ఏకాంతంలో శోకం ఆవహించింది.' అని వ్యాసాన్ని ముగించారామె. ఈ వ్యాసానికి 'మేము పంచుకునే నష్టాలు' అనే పేరు పెట్టారు మర్కెల్​.

ఇదీ చదవండి:రికార్డు సృష్టించిన ఒబామా 'ఏ ప్రామిస్డ్​ ల్యాండ్​'

ABOUT THE AUTHOR

...view details