భారత్లో మతపరంగా మైనారిటీలపై హింస, వివక్ష చోటుచేసుకుంటోందంటూ అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం.. కాంగ్రెస్కు అందజేసిన ఓ అధికారిక నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఓ వర్గం ఆందోళనలు.. విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణల విషయంలో కొన్ని మతపరమైన స్వచ్ఛంద సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రత్యేకించి ఓ మతానికి చెందినవారు కరోనా వైరస్ను వ్యాప్తి చేశారన్న ఆరోపణలు వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది.
'భారత్లో మైనారిటీలపై వివక్ష, హింస' - భారతలో మతపరమైన హింస
భారత్లో మతపరమైన మైనారిటీలపై వివక్ష, హింస చోటు చేసుకుంటోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం.. కాంగ్రెస్కు అధికారిక నివేదిక అందజేసింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఓ వర్గం ఆందోళనలు సహా పలు అంశాలను నివేదిక ప్రస్తావించింది.
అమెరికా
వీటిపై వివిధ సందర్భాల్లో భారత్ అధికారులతో అమెరికా అధికారులు చర్చించినట్లు నివేదిక పేర్కొంది. '2020 అంతర్జాతీయ మతస్వేచ్ఛపై నివేదిక' పేరిట అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ దీన్ని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా మతస్వేచ్ఛ ఉల్లంఘనలకు సంబంధించిన ఉదంతాలను ఇందులో ప్రస్తావించారు. అయితే భారత్ ఇంతకుముందే మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికా రూపొందించిన ఇలాంటి నివేదికను తోసిపుచ్చింది.