ఐక్యరాజ్యసమితి (ఐరాస).. తదుపరి ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది. ఈ మేరకు 193 సభ్య దేశాలు తమ అభ్యర్థి పేర్లను సమర్పించాలని కోరింది. ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కన్ బోజ్కిర్, బ్రిటన్ ఐరాస ప్రతినిధి వుడ్వార్డ్ సంయుక్తంగా సమర్పించిన లేఖతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రస్తుత ఐరాస కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. కాగా, ఆయన మరో ఐదేళ్ల పాటు ఈ పదవీలోనే ఉండాలనుకున్నట్లు ప్రకటించారు. ఈసారి తమ అభ్యర్థులుగా మహిళలను పంపాలని హోండోరస్ ఐరాస రాయబారి మేరీ ఎలిజబెత్ ఫ్లోరెస్ ఫ్లేక్.. అన్ని సభ్యదేశాలకు లేఖ రాశారు. ఇంతవరకు ఐరాసకు ప్రధాన కార్యదర్శి హోదాను ఒక్క మహిళ కూడా చేపట్టకపోవడం గమనార్హం.