పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఆరోగ్యం. అది పదిలంగా ఉండాలంటే.. వాళ్లకు మొదటి నుంచీ చక్కని జీవనశైలి అలవాటు చేయాలి. పోషకాహారం తీసుకునేలా ప్రోత్సహించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సమస్యలు తప్పవు. అయితే ప్రస్తుతం చిన్నపిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఈ వ్యాధి చిన్నారుల్లో వయసును బట్టి విభిన్నంగా ఉంటుందని వెల్లడించింది తాజా సర్వే.
చిన్నారుల బాల్యాన్ని నాశనం చేస్తున్న మధుమేహంపై వాషింగ్టన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ ఓ సర్వే నిర్వహించింది. ఏడేళ్ల చిన్నారులకు, 13 ఏళ్లు అంతకు పైబడిన వారికి మధుమేహం వ్యాధిలో వ్యత్యాసం ఉంటుందని వెల్లడించింది ఈ సర్వే.
మధుమేహం వస్తుందిలా
సాధారణంగా క్లోమంలోని ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలపై శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాడి చేసి వాటిని నాశనం చేసినప్పుడు మధుమేహం వస్తుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను సమర్థంగా నియంత్రించడం జరగదు. ఫలితంగా ఈ వ్యాధి బారిన పడిన వారికి నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది.
మధుమేహం అధ్యయనానికి యూరోపియన్ అసోసియేషన్ జర్నల్-డయాబెటాలజియా ప్రచురించిన పరిశోధన ప్రకారం ఏడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఇన్సులిన్‌ను సరిగా ఇంజెక్ట్ చేయడం అనేది కష్టమైన పని. అయితే ఆశ్చర్యమేమిటంటే 13, అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలకు ఈ ఇన్సులిన్ బాగానే పనిచేస్తుంది.
రెండు రకాలుగా వర్గీకరణ
ఎక్సెటర్ బృందం మధుమేహంలోని ఎండోటైపులను రెండు రకాలుగా వర్గీకరించారు.