తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో ఆగని కాల్పుల మోత... - తుపాకులు

అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల యూదుల ప్రార్థన స్థలంలో, వీధి వంటకాల్లో గుమికూడిన సమూహంపై దాడి ఘటనలు మరువకముందే మరోమారు నార్త్​ కరోలినాలో అదే తుపాకుల మోత వినిపించింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

అమెరికాలో ఆగని తుపాకుల మోత

By

Published : May 1, 2019, 8:51 AM IST

Updated : May 1, 2019, 10:57 AM IST

అమెరికా విశ్వవిద్యాలయంలో కాల్పులు

అమెరికా నార్త్​ కరోలినాలోని ఛార్లొట్​ విశ్వవిద్యాలయంలో ఓ సాయుధుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు

విద్యా సంవత్సరం చివరి రోజు కాల్పులు జరగడం గమనార్హం. తుపాకుల మోత వినిపించిన వెంటనే కళాశాల అత్యవసర నిర్వహణ విభాగం... అప్రమత్తమైంది. అందరూ తమను తాము రక్షించుకునేందుకు పరిగెత్తాలని ట్వీట్​ చేసింది. భయాందోళనలకు గురైన విద్యార్థులు.. బయటికి పరుగులు తీశారు.

అనంతరం దాడికి పాల్పడిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిని కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థిగా ధ్రువీకరించారు.అయితే.. కాల్పుల వెనుక కారణాలు ఇంతవరకు తెలియరాలేదు.

ఇదీ చూడండి:వెనెజువెలాలో తారస్థాయికి నిరసన సెగలు

Last Updated : May 1, 2019, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details