తెలంగాణ

telangana

ETV Bharat / international

"ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు అవసరం లేదు" - Trump

ఉత్తర కొరియాపై ఇకమీదట నూతన ఆంక్షలు విధింబోమని అమెరికా తెలిపింది. కిమ్ జోంగ్​ ఉన్​ దేశం ఇప్పటికే ఎన్నో సమస్యలతో బాధపడుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు అవసరం లేదు

By

Published : Mar 30, 2019, 11:45 PM IST

ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు అవసరం లేదు
ఉత్తర కొరియాపై మరిన్ని కొత్త ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉత్తర కొరియా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నందున కొత్త ఆంక్షలు విధించడాన్ని ఆపేస్తున్నామని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ తో స్నేహానికి తాము ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలిపారు.

"ఉత్తర కొరియా ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఎంతో కాలంగా కష్టాల్లో జీవిస్తున్నారు. ఈ సమయంలో ఈ దేశంపై నూతన ఆంక్షలు అవసరం లేదనుకుంటున్నా. దీని ఉద్దేశం భవిష్యత్తులో ఆంక్షలు విధిస్తామని కాదు. నేను, కిమ్ జోంగ్​ ఉన్​ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. ఉత్తర కొరియాతో వీలైనంత వరకు సత్సంబంధాలు కొనసాగించటం ఎంతో ముఖ్యమని భావిస్తున్నా. "
-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా అడుగులేస్తున్నామని గతవారమే ట్రంప్​ ట్వీట్​ చేశారు. ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నారు. ఎలాంటి ఆంక్షలు విధించబోమని ప్రకటించారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ABOUT THE AUTHOR

...view details