తెలంగాణ

telangana

ETV Bharat / international

మీడియాపై ట్రంప్​ ఆగ్రహం​ - మీడియా

మీడియా తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. న్యూజిలాండ్​ మసీదు కాల్పుల ఘటన అంశంలో తనపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తోందని ఆరోపించారు.

ట్రంప్

By

Published : Mar 19, 2019, 8:15 AM IST

Updated : Mar 19, 2019, 8:33 PM IST

మీడియాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఆగ్రహం
న్యూజిలాండ్​లోని మసీదుల్లో జరిగిన దాడుల విషయంలో మీడియా తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విమర్శించారు. ఇది హాస్యాస్పదంగా అనిపిస్తోందని ట్వీట్​ చేశారు.

"న్యూజిలాండ్​లో జరిగిన ఘోరమైన దాడి అంశంలో నాపై దుష్ప్రచారం చేసేందుకు మీడియా ఎక్కువ సమయం పనిచేస్తోంది. ఈ విషయాన్ని నమ్మించడానికి వారు చాలా కష్టపడుతున్నారు"-ట్విట్టర్​లో ట్రంప్​.

గత వారం న్యూజిలాండ్ మసీదుల్లో నరమేధం సృష్టించిన తీవ్రవాది... తనను తాను శ్వేతజాతీయుడిగా ప్రకటించుకొని.. ట్రంప్​ను శ్వేతజాతీయులకు చిహ్నంగా పేర్కొన్నాడు. ఇదంతా అక్కడ వదిలి వెళ్లిన ఒక పత్రంలో పేర్కొన్నాడుతీవ్రవాది.

కాల్పులతో విధ్వంసం సృష్టించిన తీవ్రవాది జాతి విద్వేష మేనిఫెస్టోను ట్విట్టర్​లో విడుదల చేశాడు. అమెరికన్​ మీడియాలో దీనిపై వస్తున్న కథనాలపై స్పందించిన ట్రంప్​... తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Last Updated : Mar 19, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details