అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌ల మధ్య రెండో ముఖాముఖిపై సందిగ్ధత నెలకొంది. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెండో డిబేట్‌ను వర్చువల్ పద్ధతిలో జరపాలన్న కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ (సీపీడీ) నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. వర్చువల్‌గా నిర్వహిస్తే తాను పాల్గొనబోనని చెప్పారు. మరోవైపు సీపీడీ కూడా తన నిర్ణయంపై స్పష్టంగా ఉంది. డిబేట్‌పై మరోసారి ఆలోచించలేమని గట్టిగా చెప్పింది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 15న ట్రంప్, బైడెన్ మధ్య రెండో డిబేట్ జరగాల్సి ఉంది. అయితే కొవిడ్ బారిన పడిన అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం శ్వేతసౌధంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌తో జరిగే రెండో ముఖాముఖిని వర్చువల్ విధానంలో జరపాలని సీపీడీ గురువారం నిర్ణయించింది. కాగా.. దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ఆయన.. 'వర్చువల్ పద్ధతిలో జరిగే డిబేట్‌లో పాల్గొని నా సమయాన్ని వృథా చేసుకోను. ఇది మాకు అంగీకారం కాదు' అని స్పష్టం చేశారు. బైడెన్‌ను రక్షించేందుకే సీపీడీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. సీపీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు.
బైడెన్ ఓకే