తెలంగాణ

telangana

By

Published : May 12, 2020, 2:07 PM IST

ETV Bharat / international

విలేకర్లతో ట్రంప్​ వాగ్వాదం- సమావేశం మధ్యలోనే స్టాప్​!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెంపరితనం ఏంటో ప్రపంచానికి తెలిసిందే. శ్వేతసౌధంలో ఎప్పుడు మీడియా సమావేశం జరిగినా.. వాడివేడీగానే సాగుతుంది. సమయం దొరికినప్పుడల్లా ట్రంప్​ను చిక్కుల్లోకి నెట్టేందుకు మీడియా వాళ్లు సైతం రెడీగానే ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. అమెరికాలో కొవిడ్ పరీక్షల వివరాలు తెలియజేస్తున్న సమయంలో విలేకరులతో స్వల్ప వాగ్వాదం మొదలైంది. చివరకు ట్రంప్ మధ్యలోనే సమావేశం ముగించి వెళ్లాల్సి వచ్చింది.

Trump put Chinese-American reporter on the spot
ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ విలేకరుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో కరోనా పరీక్షల అంశంపై సీఎన్​ఎన్​, సీబీఎస్ వార్తా సంస్థల విలేకరులతో మాటల యుద్ధం జరిగింది.

'ఓవైపు అమెరికా ప్రజలు వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ... ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఏముందని' సీబీఎస్​కు చెందిన చైనీస్-అమెరికన్ విలేకరి వెయిజియా జియాంగ్​.. ట్రంప్​ను ప్రశ్నించారు. ఆమెకు బదులుగా 'ఈ ప్రశ్న చైనాను అడగాలి' అని ట్రంప్ సమాధానమిచ్చారు.

అనంతరం ఇరువురి మధ్య స్వల్ప మాటలయుద్ధం జరగ్గా.. చివరకు సమావేశం ముగిసిందని ప్రకటించి ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

విలేకరితో ట్రంప్ వాగ్వాదం

ప్రతీ వనరుతో యుద్ధం

అంతకుముందు.. అమెరికాలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచినట్లు ట్రంప్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ వారంలో పరీక్షల సంఖ్య 10 మిలియన్లను దాటుతుందని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ప్రతీ వనరులను ఉపయోగించి కొవిడ్​పై పోరాటం సాగిస్తున్నట్లు వెల్లడించారు.

"అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, సైనిక, ఆర్థిక, శాస్త్రీయ, పారిశ్రామిక వనరులను కొవిడ్​పై పోరులో ఉపయోగిస్తున్నాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తయారీ పెంచడానికి భారీ ప్రణాళికలు రూపొందించాం. వైరస్​తో కోల్పోయిన ప్రతి ప్రాణానికీ నేను దుఃఖిస్తున్నాను. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను." -డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

పరీక్షలే పరీక్షలు

మూడు వారాల క్రితం రోజుకు లక్షా 50 వేల కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షలకు పెరిగింది. దేశంలోని 92 ప్రభుత్వ ల్యాబరేటరీల్లో పరీక్షలు నిర్వహించడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details