అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు రోజుల జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య మైత్రిని బలోపేతం చేసేందుకు ట్రంప్ - జపాన్ ప్రధాని షింజో అబే చర్చలు జరపనున్నారు. అమెరికా- జపాన్ మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇరుదేశాల వాణిజ్య ఉద్రిక్తతల నడుమ జపాన్‌లో ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఇరు దేశాల నేతలు ఆటవిడుపుగా గోల్ఫ్ ఆడారు. అమెరికా- జపాన్ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలపై సోమవారం అగ్రనేతలు చర్చించనున్నారు.
ఇరుదేశాల వాణిజ్య ఉద్రిక్తతల నడుమ జపాన్‌లో ట్రంప్
రెండో రోజు ట్రంప్- జపాన్ ప్రధాని షింజో అబే కలిసి గోల్ఫ్ ఆడారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
వాణిజ్య సమస్యల పరిష్కారానికి ఇరు దేశాల నేతలు సోమవారం చర్చలు జరపనున్నారు. 2017లో బహుళజాతి ట్రాన్స్- పెసిఫిక్ భాగస్వామ్యం నుంచి ట్రంప్ వైదొలిగినప్పటి నుంచి జపాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది.